2024లో అమెరికా అధ్యక్ష స్థానంలో మహిళ: నిక్కీ హేలీ

‘2024లో అమెరికా అధ్యక్ష స్థానంలో ఓ మహిళ ఉండబోతున్నారు. ఆ అవకాశం తనకుగానీ.. కమలా హారిస్‌కుగానీ దక్కవచ్చు’ అని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌తో పోటీపడుతున్న నిక్కీహేలీ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

Updated : 10 Feb 2024 05:55 IST

వాషింగ్టన్‌: ‘2024లో అమెరికా అధ్యక్ష స్థానంలో ఓ మహిళ ఉండబోతున్నారు. ఆ అవకాశం తనకుగానీ.. కమలా హారిస్‌కుగానీ దక్కవచ్చు’ అని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌తో పోటీపడుతున్న నిక్కీహేలీ ఓ వార్తా సంస్థకు తెలిపారు. నిక్కీహేలీతోపాటు డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన కమలా హారిస్‌ కూడా భారతీయ మూలాలున్న మహిళ అన్న సంగతి తెలిసిందే. ‘‘నేను ట్రంప్‌నకు రెండుసార్లు ఓటు వేశా. ఆయన పరిపాలనలో ఐక్యరాజ్య సమితి రాయబారిగా పనిచేయడం నాకు గర్వకారణం. కానీ ట్రంప్‌ వ్యవహారం గందరగోళంగా ఉంటుంది. దేశాన్ని మరోసారి ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్లదలచుకోవట్లేదు. ట్రంప్‌ ఎన్నికల్లో గెలవలేరు. కోర్టు కేసుల్లో ఆయన కూరుకుపోయారు’’ అని హేలీ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని