గర్భిణుల మానసిక ఒత్తిడితో బిడ్డలపై తీవ్ర ప్రభావం

గర్భవతులు అధిక ఒత్తిడి, ఆదుర్దాలకు లోనైనప్పుడు విడుదలయ్యే ఎడ్రెనల్‌ వల్ల ఆమె తొలిచూలు కుమార్తెలో శారీరకమైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు.

Published : 22 Feb 2024 04:49 IST

దిల్లీ: గర్భవతులు అధిక ఒత్తిడి, ఆదుర్దాలకు లోనైనప్పుడు విడుదలయ్యే ఎడ్రెనల్‌ వల్ల ఆమె తొలిచూలు కుమార్తెలో శారీరకమైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ముందుగానే రజస్వల లక్షణాలు కనిపించడం వీటిలో ఒకటి. మొటిమలు, కేశాలు పెరగడం వంటివి సంభవిస్తాయి. అదే సమయంలో, ఆమెకు త్వరగా రుతుస్రావం కావాలని లేదు, వక్షోజాలూ పెరగకపోవచ్చు. ఇలాంటి కేసుల్లో మొదటి సంతానం కుమారుడైతే వృషణాల సైజు పెద్దది కాకపోవచ్చు. ఈ పరిశోధనకు కాలిఫోర్నియాలో 253 తల్లీ-బిడ్డల ద్వయాలను తీసుకున్నారు. వారిలో సగం మంది తల్లులు మొదటిసారి గర్భం ధరించారు. అందరు తల్లుల సగటు వయసు 30 ఏళ్లు. గర్భధారణ సమయంలో తల్లుల మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను తాజా పరిశోధన చాటిచెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని