30 వేలకు చేరువలో గాజా మృతుల సంఖ్య

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. మరోవైపు గాజాపై టెల్‌ అవీవ్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Updated : 23 Feb 2024 06:16 IST

దుబాయ్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. మరోవైపు గాజాపై టెల్‌ అవీవ్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి నుంచి జరుగుతున్న దాడుల్లో 48 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 30 వేలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారానికి ఈ సంఖ్య 29,400కు చేరుకుంది. వెస్ట్‌బ్యాంకులోనూ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఓ చెక్‌ పాయింట్‌ దగ్గర ముగ్గురు పాలస్తీనీయన్లు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, ఐదుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్‌ పోలీసులు తెలిపారు.

మంటల్లో మరో వాణిజ్య నౌక

ఎర్రసముద్రంలో హూతీలు మరో దాడికి పాల్పడ్డారు. గురువారం ఎడెన్‌ జలసంధికి సమీపంలో ఓ నౌకపై క్షిపణి ప్రయోగించారు. దీంతో అది మంటల్లో చిక్కుకుంది. అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని