రష్యాపై అమెరికా, ఈయూ కొత్త ఆంక్షలు

ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తి రెండేళ్లు పూర్తవడం, పుతిన్‌ విమర్శకుడు అలెక్సీ నావల్నీ రష్యా జైలులో మరణించడాన్ని పురస్కరించుకుని అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)లు మాస్కోపై కొత్త ఆంక్షలు విధిస్తున్నాయి.

Published : 24 Feb 2024 04:13 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తి రెండేళ్లు పూర్తవడం, పుతిన్‌ విమర్శకుడు అలెక్సీ నావల్నీ రష్యా జైలులో మరణించడాన్ని పురస్కరించుకుని అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)లు మాస్కోపై కొత్త ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాలో రెండో అతిపెద్ద బ్యాంకుతోపాటు ఇతర రష్యన్‌ వ్యాపారుల మీద గురువారం అమెరికా న్యాయశాఖ అయిదు కేసులు పెట్టింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి పనికొచ్చే సాంకేతికతలను రష్యాకు సరఫరా చేసిన కొన్ని విదేశీ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈయూ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీల్లో కొన్ని భారత్‌, చైనా, శ్రీలంక, తుర్కియే వంటి దేశాలకు చెందినవి. ముఖ్యంగా డ్రోన్‌ విడిభాగాలు రష్యాకు అందకుండా జాగ్రత్త పడుతున్నామని ఈయూ తెలిపింది. అమెరికా న్యాయశాఖ కూడా రష్యన్‌ అధికారులు, వ్యాపారులపై కొత్త ఆంక్షలు విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. నావల్నీ అరెస్టుకు కారకులైన రష్యన్లపై ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. రష్యా రక్షణ, పారిశ్రామిక, ఫైనాన్స్‌, సరఫరా యంత్రాంగాలపైనా ఆంక్షలు విధిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని