మాల్దీవుల గొంతు తడిపిన చైనా

మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది.

Published : 28 Mar 2024 04:13 IST

మాలె: మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. భారత్‌తో మాల్దీవులకు ద్వైపాక్షిక వివాదం తలెత్తిన తర్వాత ఈ ద్వీప దేశానికి చైనా మరింత చేరువ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా 1,500 టన్నుల తాగునీటిని మాల్దీవులకు డ్రాగన్‌ అందజేసింది. టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి ఈ నీటిని సేకరించింది. గతేడాది నవంబరులో టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ ఛైర్మన్‌ యాన్‌ జిన్హాయ్‌ మాల్దీవుల్లో పర్యటించారు. ఆ సందర్భంగా తాగునీటి కొరతను అధిగమించేందుకు ద్వీప దేశానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. మాల్దీవులకు పొరుగు దేశాలు తాగునీటిని అందించడం ఇదే తొలిసారి కాదు. 2014లో ‘ఆపరేషన్‌ నీర్‌’ పేరిట మాల్దీవులకు మొదటివిడతలో 375 టన్నుల తాగునీటిని భారత్‌ సరఫరా చేసింది. తర్వాత మరో రెండు వేల టన్నుల నీరు పంపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని