ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్‌ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు.

Published : 28 Mar 2024 04:14 IST

ఏడుగురు లెబనాన్‌ పారామెడిక్స్‌ మృతి
ప్రతిదాడిలో ఒక ఇజ్రాయెలీ మరణం

హెబ్బారియే: దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్‌ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. సున్నీ ముస్లింల గ్రూపునకు చెందిన పారామెడిక్స్‌ కేంద్రంపై ఇజ్రాయెల్‌ ఈ దాడి చేసింది. దీంతో ఏడుగురు ఆ గ్రూపు సభ్యులు మరణించారు. మంగళవారం నుంచి రెండు దేశాల మధ్య రాకెట్‌ దాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్‌ ఎమర్జెన్సీ అండ్‌ రిలీఫ్‌ కోర్‌కు చెందినవారు మృతి చెందారు. వారి వివరాలను పారామెడిక్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతంలోని కిర్యత్‌ షమోనాపై దాడి చేసింది. ఈ ఘటనలో 25ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

వెస్ట్‌బ్యాంకులో మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన సోదాల సందర్భంగా ముగ్గురు పాలస్తీనీయులు మృతి చెందారు. మిలిటెంట్లు పేలుడు పదార్థాలను విసరగా కాల్పులు జరిపామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, వైమానిక దాడిలో ఇద్దరు మరణించారు. నలుగురు గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని