సిరియాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

హమాస్‌తో యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారు.

Published : 30 Mar 2024 03:51 IST

44 మంది మృతి!

బీరుట్‌: హమాస్‌తో యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారి. అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్‌బొల్లాకు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే ‘సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని