రష్యా డ్రోన్ల కర్మాగారం, రిఫైనరీపై ఉక్రెయిన్‌ దాడి

రష్యాలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారాల్లో ఒకదానిపై, మరో డ్రోన్ల కర్మాగారంపై ఉక్రెయిన్‌ డ్రోన్లు భారీ దాడికి పాల్పడ్డాయి. యుద్ధం మొదలయ్యాక రష్యా భూభాగంలో తతార్‌స్థాన్‌ వరకు ఉక్రెయిన్‌ వెళ్లి దాడి చేయడం ఇదే  మొదటిసారి అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Published : 03 Apr 2024 04:36 IST

కీవ్‌: రష్యాలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారాల్లో ఒకదానిపై, మరో డ్రోన్ల కర్మాగారంపై ఉక్రెయిన్‌ డ్రోన్లు భారీ దాడికి పాల్పడ్డాయి. యుద్ధం మొదలయ్యాక రష్యా భూభాగంలో తతార్‌స్థాన్‌ వరకు ఉక్రెయిన్‌ వెళ్లి దాడి చేయడం ఇదే  మొదటిసారి అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌కు 1,200 కి.మీ. దూరంలో.. రెండు నగరాలకు చేరువగా ఉన్నచోట్ల ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఇటీవలి కాలంలో రష్యా చమురు కేంద్రాలను ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకుంటోంది. దీనిలో భాగంగా ఎక్కువ దూరాల్లోని లక్ష్యాలను డ్రోన్లు చేరుకునేలా ఉక్రెయిన్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. తాజా దాడులు దానిలో భాగమే. సాధారణంగా రష్యా భూభాగంలో జరిగే దాడిపై బాహాటంగా మాట్లాడడానికి ఇష్టపడని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తాజా దాడిని మాత్రం తామే చేసినట్లు తెలిపాయి. సోమవారం రాత్రి దీనిని నిర్వహించినట్లు మంగళవారం వెల్లడించాయి. దాడి వల్ల ఉత్పత్తికి ఎలాంటి అవాంతరం వాటిల్లలేదని రిఫైనరీ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని