సిడ్నీ మాల్‌లో కత్తితో దాడి.. ఆరుగురి దుర్మరణం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రద్దీగా ఉండే వెస్ట్‌ఫీల్డ్‌ షాపింగ్‌ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు (40) అక్కడున్నవారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Published : 14 Apr 2024 03:45 IST

పోలీసు కాల్పుల్లో దుండగుడి మృతి

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రద్దీగా ఉండే వెస్ట్‌ఫీల్డ్‌ షాపింగ్‌ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు (40) అక్కడున్నవారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది నెలల చిన్నారితోపాటు 8 మంది గాయపడ్డారు. మృతుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. మాల్‌లో ఉన్న వినియోగదారులను, సిబ్బందిని బయటకు తరలించిన పోలీసులు నలువైపులా చుట్టుముట్టి హంతకుడిని మట్టుబెట్టారు. ఆగంతకుడు పెద్దకత్తితో మాల్‌లో తిరగడం మీడియా దృశ్యాల్లో కనిపించింది. క్షతగాత్రుల్లో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి శస్త్రచికిత్స చేస్తున్నారు. దుండగుడు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డాడో తెలియరాలేదు. ఉగ్రవాద ఘటన మాత్రం కాదని పోలీస్‌ కమిషనర్‌ కారెన్‌ వెబ్‌ మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని