మేయర్‌కు ఉగ్ర బెదిరింపులు

భారత సంతతికి చెందిన ఓ మహిళ అమెరికాలోని కాలిఫోర్నియా నగర మేయర్‌పై ఉగ్ర బెదిరింపులకు పాల్పడింది.

Published : 14 Apr 2024 05:18 IST

అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన ఓ మహిళ అమెరికాలోని కాలిఫోర్నియా నగర మేయర్‌పై ఉగ్ర బెదిరింపులకు పాల్పడింది. దీంతో మేయర్‌ ఆదేశాల మేరకు ఆమెను అరెస్టు చేశారు. బేకర్స్‌ఫీల్డ్‌లో జరిగిన సమావేశంలో రిద్ధి పటేల్‌ అనే మహిళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీల అణచివేత, ఇజ్రాయెల్‌- హమాస్‌ అంశాలను ప్రస్తావించిన ఆమె.. మేయర్‌ కరెన్‌ గోహ్‌పై విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ వ్యవహారంలో కాల్పుల విరమణ తీర్మానానికి మద్దతు ఇవ్వనందుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన మైనారిటీలు హింసాత్మక విప్లవం ద్వారా ఏదో ఒకరోజు అధికారులు అందరినీ అంతం చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద మెటల్‌ డిటెక్టర్లు, అదనపు భద్రతను ఏర్పాటుచేయడం నిరసనకారులను నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నమేనని తప్పుబట్టారు. మేయర్‌ను హత్య చేసేందుకు ఆమె ఇంట్లో కలుస్తామంటూ ప్రసంగాన్ని ముగించారు. రిద్ధి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని