సింగపూర్‌ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్‌ లూంగ్‌

ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపూర్‌కు దాదాపు 20 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న లీ సీన్‌ లూంగ్‌(72) ఆ బాధ్యతలు వీడనున్నారు.

Published : 16 Apr 2024 05:01 IST

 మే 15న ఆ బాధ్యతలు చేపట్టనున్న ఉప ప్రధాని లారెన్స్‌ వాంగ్‌

సింగపూర్‌: ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపూర్‌కు దాదాపు 20 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న లీ సీన్‌ లూంగ్‌(72) ఆ బాధ్యతలు వీడనున్నారు. మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ఆయన సోమవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. ఆ స్థానాన్ని ఉప ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ భర్తీ చేయనున్నారు. ఆ దేశ మూడో ప్రధానిగా లీ సీన్‌ లూంగ్‌ 2004 ఆగస్టులో ప్రమాణస్వీకారం చేశారు. నాయకత్వ మార్పుపై దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయన గతంలోనే పదవిని వీడాల్సింది. అయితే కరోనా పరిస్థితులు, తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని