పత్రాల్లో పొరపాటు.. ఒక జంట బదులు మరొకరికి విడాకులు

బ్రిటన్‌లోని ఓ సంస్థ చేసిన చిన్న తప్పువల్ల ఒక జంట బదులు మరో జంటకు విడాకులు మంజూరయ్యాయి. ఆన్‌లైన్‌ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. ఇంకా అది చర్చల దశలో ఉండగానే విడాకులు పొందారు.

Published : 17 Apr 2024 04:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లోని ఓ సంస్థ చేసిన చిన్న తప్పువల్ల ఒక జంట బదులు మరో జంటకు విడాకులు మంజూరయ్యాయి. ఆన్‌లైన్‌ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. ఇంకా అది చర్చల దశలో ఉండగానే విడాకులు పొందారు. బ్రిటన్‌కు చెందిన విలియమ్స్‌ అనే మహిళకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. గతేడాది నుంచి భార్యాభర్త విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ సంస్థ ద్వారా దంపతుల మధ్య ఆర్థిక అంశాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. మరో క్లయింట్‌కు తుది విడాకుల కోసం రూపొందించిన పత్రాల్లో పొరబాటున విలియమ్స్‌ దంపతుల పేరును చేర్చారు. ఈ పత్రాలను అలాగే కోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేవలం 21 నిమిషాల వ్యవధిలోనే ఆ జంటకు విడాకులు మంజూరుచేసింది. ఈ తప్పిదాన్ని కొన్నిరోజుల తర్వాత ఆ సంస్థ గుర్తించింది. తాము అందజేసిన పత్రాల్లో పొరపాటు జరిగిందని, విడాకులను రద్దు చేయాలని కోరుతూ విలియమ్స్‌ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని