ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్‌ కార్యాలయాల్లో ఆందోళనలు

ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్‌ సంస్థ విధులు నుంచి తొలగించింది.

Published : 19 Apr 2024 05:10 IST

28 మంది ఉద్యోగులపై వేటు

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్‌ సంస్థ విధులు నుంచి తొలగించింది. ఈ ఉద్యోగులంతా కాలిఫోర్నియా, న్యూయార్క్‌లోని సంస్థ కార్యాలయాల్లోకి ప్రవేశించి ఆందోళనలు నిర్వహించారు. ఇలా ధర్నాలు చేస్తున్న తొమ్మిది మందిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇజ్రాయెల్‌ సైన్యంతో గూగుల్‌ కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ 1.2 బిలియన్‌ డాలర్లు. ‘‘చాలా తక్కువ సంఖ్యలో ఉద్యోగులు కొన్ని కార్యాలయాల్లోకి ప్రవేశించి ఆందోళన నిర్వహించారు. ఆవరణ వదిలి వెళ్లమని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించారు. దీంతో కార్యాలయాల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులను పిలిపించి ఖాళీ చేయించాం’’ అని గూగుల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని