మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు

ఇజ్రాయెల్‌ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది.

Published : 19 Apr 2024 05:11 IST

అణుబాంబు తయారీకి వెనుకాడం
ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లో అణుకేంద్రాలు ఎక్కడున్నాయో తమకు తెలుసునని, క్షిపణులతో వాటిని ధ్వంసం చేస్తామని పేర్కొంది. అదే సమయంలో శాంతియుత ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగుతున్న తమ అణువిధానాన్నీ సమీక్షిస్తామని తెలిపింది. అణుబాంబును తయారు చేయడానికి సైతం వెనుకాడబోమని తెలిపింది. ఇప్పటికే ఇరాన్‌ యురేనియంను 60 శాతం శుద్ధి చేస్తోందని.. 90 శాతం శుద్ధి చేసే సాంకేతికత కూడా ఆ దేశానికి ఉందని ఫిబ్రవరిలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. 90 శాతం శుద్ధి చేసిన యురేనియంతో అణ్వాయుధాలు తయారు చేయొచ్చు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని