కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 19 Apr 2024 05:57 IST

నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు!

ఒట్టావా: కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతేడాది ఏప్రిల్‌ 17న టొరంటో ఎయిర్‌పోర్టులో 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారం, 2.5 మిలియన్ల విలువైన విదేశీ నగదు ఉన్న ఓ విమానం కంటైనర్‌ అదృశ్యమైంది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ కేసులో పురోగతి కనిపించింది. బుధవారం ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని