పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది.

Updated : 20 Apr 2024 05:47 IST

ఐరాస: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. గురువారం తీసుకొచ్చిన ఈ తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా తన వీటో హక్కును ఉపయోగించింది. తీర్మానం ఆమోదానికి ఎటువంటి వీటో లేకుండా తొమ్మిది ఓట్లు అవసరం. అయితే అనుకూల ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ అమెరికా వీటో చేయడంతో తీర్మానం చెల్లకుండా పోయింది. అమెరికా చర్యను ఇజ్రాయెల్‌ ప్రశంసించగా, అన్యాయం, అనైతికమంటూ పాలస్తీనా తీవ్రంగా విమర్శించింది. ఐరాసలో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం పాలస్తీనా 2011 నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది. 2012 నవంబరు నుంచి పరిశీలక దేశం హోదా లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని