ఇరాక్‌లో సోషల్‌ మీడియా స్టార్‌ దారుణహత్య

ఇరాక్‌లో సోషల్‌ మీడియా స్టార్‌గా పేరొందిన ఘఫ్రాన్‌ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్‌లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు.

Published : 29 Apr 2024 04:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాక్‌లో సోషల్‌ మీడియా స్టార్‌గా పేరొందిన ఘఫ్రాన్‌ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్‌లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. టిక్‌టాక్‌లో ఉమ్‌ ఫహాద్‌గా ప్రజాదరణ పొందిన ఈమెకు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. తూర్పు బాగ్దాద్‌లోని జయౌనా ప్రాంతంలోని సఫాదీ ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనం మీద వచ్చిన దుండగుడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలో సఫాదీ చేసిన కొన్ని వీడియోలు వివాదాస్పదమయ్యాయి. నైతికత ఉల్లంఘన కింద ఆమెకు ఆరు నెలల జైలుశిక్ష కూడా పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పాప్‌ మ్యుజిక్‌కు నృత్యాలు చేస్తూ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇరాక్‌లో టిక్‌టాక్‌ వీడియోలతో పేరుపొందిన నూర్‌ అల్‌సఫర్‌ అనే యువతి కూడా 2023లో హత్యకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని