రణరంగంగా తైవాన్‌ పార్లమెంటు

ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్‌ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు.

Published : 19 May 2024 06:19 IST

పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకున్న ఎంపీలు

మహిళా సభ్యురాలిని కింద పడేస్తున్న తోటి సభ్యుడు

తైపీ:  ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్‌ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. పార్లమెంట్‌లో సంస్కరణలకు సంబంధించి శుక్రవారం సభలో ప్రతిపక్షాలు బిల్లును ప్రతిపాదించాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఎంపీలకు మరింత ఎక్కువ అధికారాలు ఉండాలని ఆ బిల్లులో పేర్కొన్నాయి. పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేలా ప్రతిపాదనలు చేశాయి. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరుగుతుండగా సభ్యులు ముష్టిఘాతాలకు దిగారు. అది కాస్త తీవ్రమై ఎంపీలు ఒకరినొకరు తోసుకున్నారు.కొందరు టేబుల్స్‌ పైనుంచి దూకి స్పీకర్‌ కుర్చీ వద్దకు వెళ్లి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఓ ఎంపీ బిల్లు కాగితాలను   సభ్యుడిని నుంచి లాగేసుకొని సభ నుంచి బయటకు పారిపోయారు. మరో  సభ్యుడు మహిళా ఎంపీని ఎత్తుకొని కింద పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తైవాన్‌ మీడియాలో ప్రసారమయ్యాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని