ఐసీసీ అరెస్టు వారెంట్ల అభ్యర్థనకు ఫ్రాన్స్‌ మద్దతు

తమపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలంటూ అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి (ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ చేసిన అభ్యర్థనపై గరంగరంగా ఉన్న ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Updated : 22 May 2024 19:56 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాలన్న అభ్యర్థనకు ఫ్రాన్స్, బెల్జియం, స్లొవేనియా మద్దతు పలికాయి. అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి (ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ చేసిన అభ్యర్థనపై ఇప్పటికే గరంగరంగా ఉన్న ఇజ్రాయెల్‌కు దీంతో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి గలాంట్‌తో పాటు.. హమాస్‌ నేతలు యహ్య సిన్వర్, మహమ్మద్‌ డైఫ్, ఇస్మాయిల్‌ హనియాలకు వ్యతిరేకంగా ప్రధాన ప్రాసిక్యూటర్‌ సోమవారం యుద్ధ నేరాల అభియోగాలు మోపుతూ.. అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ఐసీసీని కోరారు. దీనిపై ఫ్రాన్స్‌ స్పందిస్తూ.. అంతర్జాతీయ నేర న్యాయస్థానం స్వతంత్రతకు మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని పేర్కొంది. బెల్జియం, స్లొవేనియా కూడా ఐసీసీకి మద్దతు పలికాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని