మరో రెండు ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్‌ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌లు కెంటకీ, ఓరెగన్‌ ప్రైమరీల్లో విజయం సాధించారు. ఆయా పార్టీల తరఫున వీరికి అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారయ్యాయి.

Updated : 23 May 2024 05:57 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌లు కెంటకీ, ఓరెగన్‌ ప్రైమరీల్లో విజయం సాధించారు. ఆయా పార్టీల తరఫున వీరికి అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారయ్యాయి. వీరు మరికొన్ని చోట్ల జాతీయ కన్వెన్షన్లు నిర్వహించి.. డెలిగేట్ల మద్దతు సంపాదిస్తున్నారు. రెండు పార్టీలలోని వారి ప్రత్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. అయినా బైడెన్, ట్రంప్‌లకు సొంత పార్టీలలో అసమ్మతి ఎదురవుతోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై బైడెన్‌ విధానాన్ని డెమోక్రటిక్‌ పార్టీలో కొందరు నిరసిస్తున్నారు. ట్రంప్‌నకు పోటీగా రిపబ్లికన్‌ నామినేషన్‌ కోసం ప్రయత్నించి ఓడిన నిక్కీ హేలీకి ఇప్పటికీ పార్టీ ప్రైమరీలలో ఓట్లు పడుతున్నాయి. పోటీ నుంచి తప్పుకున్న నిక్కీ హేలీకి రిపబ్లికన్‌ ప్రైమరీలో 6 శాతం ఓట్లు లభించడం విశేషం.


అమెరికాలోని అయోవాలో టోర్నడో బీభత్సానికి ధ్వంసమైన నివాస భవనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని