లండన్‌లో రైసీ సంతాప కార్యక్రమంలో గొడవ

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్‌ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సంస్మరణ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగి నలుగురు గాయపడ్డారని బ్రిటన్‌ పోలీసులు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

Published : 26 May 2024 04:44 IST

నలుగురికి గాయాలు.. ఒకరి మృతి

లండన్‌: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్‌ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సంస్మరణ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగి నలుగురు గాయపడ్డారని బ్రిటన్‌ పోలీసులు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. శుక్రవారం వెస్ట్‌ లండన్‌లో వెంబ్లీలో రైసీ మృతికి సంతాప సూచకంగా కార్యక్రమం జరిగింది. ఈ వేదిక బయట ఇరాన్‌ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు గుమికూడారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని