అఫ్గాన్‌లో మళ్లీ వరదల బీభత్సం.. 15 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ను మళ్లీ భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ వరదల కారణంగా వందల మంది మృత్యువాతపడ్డారు.

Published : 27 May 2024 05:37 IST

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌ను మళ్లీ భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ వరదల కారణంగా వందల మంది మృత్యువాతపడ్డారు. అనేక భవనాలు, పంటలు నాశనమయ్యాయి. ఈశాన్య ప్రాంతాలైన బదక్షన్, బగ్లాన్‌ ఫ్రావిన్సుల్లో శనివారం రాత్రి భారీ వరదలు సంభవించాయి. బదక్షాన్‌ రాజధాని ఫైజాబాద్‌లో వరదల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సహా 15 మంది మృతిచెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బగ్లాన్‌ ఫ్రావిన్స్‌లోని దోశి జిల్లాలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయని, కొద్దిమంది చనిపోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి ఇదాయతుల్లా తెలిపారు. బగ్లాన్‌లో ఈ నెల 10, 11న 300 మందికి పైగా మృతిచెందగా.. ఘోర్‌ ప్రాంతంలో ఈ నెల 18న 50 మంది, 19న 84 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని