2 వేలకు చేరిన మృతుల సంఖ్య

పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2 వేల మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి రాసిన లేఖలో న్యూగినీ ప్రభుత్వం తెలిపింది.

Updated : 28 May 2024 05:34 IST

సాయం కోసం ఐరాసకు పాపువా న్యూగినీ విజ్ఞప్తి
నత్తనడకన సహాయక చర్యలు

మెల్‌బోర్న్‌: పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2 వేల మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి రాసిన లేఖలో న్యూగినీ ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ సాయాన్ని కోరింది. శుక్రవారం తెల్లవారుజామున ఎంగా ప్రావిన్స్‌లో యంబాలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిద్రలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత 100 మంది మరణించారని అంచనా వేశారు. ఆదివారం ఈ సంఖ్యను 670గా ఐరాసకు చెందిన సంస్థ పేర్కొంది. సోమవారం ఐరాసకు రాసిన లేఖలో పాపువా న్యూగినీ అధికారులు.. 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దాదాపు 24 నుంచి 26 అడుగుల లోతుకు వెళ్లి మృతదేహాలను వెలికితీయాల్సి రావడం, మౌలిక వసతులు లేకపోవడం, ప్రధాన రహదారి మూసుకుపోవడంతో సహాయ కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు