యెమెన్‌లో కూలిన మరో అమెరికా డ్రోన్‌!

ఓ అమెరికా ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ ధర 30 మిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.250 కోట్లు. అంత విలువైన అమెరికా డ్రోన్లను యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు వరుసగా పడగొడుతున్నారు.

Published : 30 May 2024 05:04 IST

దుబాయ్‌: ఓ అమెరికా ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ ధర 30 మిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.250 కోట్లు. అంత విలువైన అమెరికా డ్రోన్లను యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు వరుసగా పడగొడుతున్నారు. బుధవారం మరో రీపర్‌ కూలినట్లు అమెరికా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నెలలో ఇలా కూలిన మూడో డ్రోన్‌ ఇది. అంటే దాదాపు రూ.750 కోట్లు అగ్రరాజ్యం నష్టపోయింది. యెమెన్‌లోని సెంట్రల్‌ మారిబ్‌ ప్రావిన్స్‌లోని ఎడారిలో డ్రోన్‌ పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.ఈ డ్రోన్‌ విషయంలో హూతీ తిరుగుబాటుదారులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీలు గత కొన్ని నెలలుగా దాడుల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటుదారుల ఆక్రమణలో ఉన్న యెమెన్‌ భూభాగంలో అమెరికా వైమానిక, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇందులో ఎంక్యూ-9 రీపర్లు కూడా పాలుపంచుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని