కొరియన్‌ ద్వీపకల్పంపై బి-1బి బాంబర్‌ చక్కర్లు

ఆయుధ పరీక్షలతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా అమెరికా తన బి-1బి బాంబర్‌ను రంగంలోకి దించింది. బుధవారం కొరియన్‌ ద్వీపకల్పంపై ఇది గగనవిహారం చేసింది.

Updated : 06 Jun 2024 07:02 IST

ఏడేళ్ల తర్వాత రంగంలోకి దించిన అమెరికా 

సియోల్‌: ఆయుధ పరీక్షలతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా అమెరికా తన బి-1బి బాంబర్‌ను రంగంలోకి దించింది. బుధవారం కొరియన్‌ ద్వీపకల్పంపై ఇది గగనవిహారం చేసింది. దక్షిణ కొరియాతో కలిసి బాంబింగ్‌ విన్యాసాలను నిర్వహించింది. ఏడేళ్లలో ఈ బాంబర్‌ ఈ ప్రాంతంలో గగనవిహారం చేయడం ఇదే మొదటిసారి. ఈ విన్యాసాల్లో అమెరికా, దక్షిణ కొరియాలకు చెందిన అనేక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వీటిలో బి-1బి బాంబర్‌.. జాయింట్‌ డైరెక్ట్‌ అటాక్‌ మ్యునిషన్‌ (జ్యేడామ్‌) అనే బాంబులను జారవిడిచింది. చివరిసారిగా ఈ బాంబరు 2017లో కొరియా ద్వీపకల్పంపై గగనవిహారం చేసింది. జేడ్యామ్‌ అనేది ఒక మార్గనిర్దేశక వ్యవస్థ. ఇది సంప్రదాయ అన్‌గైడెడ్‌ బాంబులను మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల జీపీఎస్‌ గైడెడ్‌ ఆయుధాలుగా మారుస్తుంది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లు ఈ జేడ్యామ్‌లను ప్రయోగించగలవు. రష్యా దాడులను ఎదుర్కోవడానికి వీటిని ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని