మీపై దాడికి ఇతరులకు ఆయుధాలిస్తాం

ఉక్రెయిన్‌తో యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని పాశ్చాత్య దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. అదే జరిగితే తామూ ఇతర దేశాలకు ఆయుధాలిచ్చి దాడి చేసేందుకు ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

Published : 07 Jun 2024 06:13 IST

పాశ్చాత్య దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని పాశ్చాత్య దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. అదే జరిగితే తామూ ఇతర దేశాలకు ఆయుధాలిచ్చి దాడి చేసేందుకు ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. జర్మనీ తమ ఆయుధాలను ఉక్రెయిన్‌తో ప్రయోగింపజేస్తోందని ఆరోపించారు. దీన్ని చాలా ‘ప్రమాదకరమైన చర్య’గా అభివర్ణించారు. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్‌ తొలిసారి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. జర్మనీ తమ ఆయుధాల ప్రయోగాన్ని నిలువరించకపోతే.. తామూ ఇతర దేశాలకు దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలను సరఫరా చేస్తామని పుతిన్‌ తెలిపారు. తాము ఎప్పుడూ ముందస్తుగా అణు బాంబులను ఉపయోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ ఇతర దేశాలు తమ భద్రతకు ముప్పు తలపెడితే మాత్రం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని