ఆయుధాలను ఆపినందుకు క్షమించండి

ఉక్రెయిన్‌ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ క్షమాపణలు చెప్పారు. ఆయుధాలకు అవసరమైన నిధులను సకాలంలో పంపించకపోవడంతో ఖర్కివ్‌లో రష్యా ఆక్రమణలు కొనసాగాయని, అందులో తన బాధ్యత కూడా ఉందని అన్నారు.

Published : 08 Jun 2024 06:21 IST

 ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి తెలిపిన బైడెన్‌
మీ ప్రత్యర్థులకు ఆయుధాలిస్తాం: పుతిన్‌

పారిస్‌: ఉక్రెయిన్‌ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ క్షమాపణలు చెప్పారు. ఆయుధాలకు అవసరమైన నిధులను సకాలంలో పంపించకపోవడంతో ఖర్కివ్‌లో రష్యా ఆక్రమణలు కొనసాగాయని, అందులో తన బాధ్యత కూడా ఉందని అన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా ఉక్రెయిన్‌ ఆయుధ ప్యాకేజీ కొన్ని నెలల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమోదం పొందింది. అయితే ఆ సమయంలో రష్యా దూకుడు పెంచింది. ముఖ్యంగా ఖర్కివ్‌లోని చాలా ప్రాంతాలను ఆక్రమించింది. రెండో ప్రపంచయుద్ధానికి సంబంధించిన డీ డే ఉత్సవాల్లో హాజరయ్యేందుకు పారిస్‌ వచ్చిన బైడెన్‌ను జెలెన్‌స్కీ కలిశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అభయమిచ్చారు. మరోవైపు అమెరికా, దాని మిత్ర పక్షాల ప్రత్యర్థులకు ఆయుధాలు సరఫరా చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తోందని మరోసారి పుతిన్‌ హెచ్చరించారు. ఏయే దేశాలకు లేదా సంస్థలకు ఈ ఆయుధాలను రష్యా పంపించనుందన్న విషయాన్ని పుతిన్‌ వెల్లడించలేదు.  ‘‘వారు (పాశ్చాత్య దేశాలు) పంపిన ఆయుధాలు ఉక్రెయిన్‌ మాపై ఉపయోగిస్తే మాకు కూడా అలా చేసే హక్కు ఉంటుంది’’ అని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని