ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడిలోరష్యా ఎస్‌యూ-57 ధ్వంసం

తాము ఇచ్చిన ఆయుధాలను రష్యా భూభాగంలోనూ వాడొచ్చంటూ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సంకేతాలిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.

Published : 10 Jun 2024 05:20 IST

కీవ్‌: తాము ఇచ్చిన ఆయుధాలను రష్యా భూభాగంలోనూ వాడొచ్చంటూ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సంకేతాలిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం దక్షిణ రష్యాలో ఆస్ట్రాఖాన్‌ ప్రాంతంలోని వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన అత్యాధునిక ఎస్‌యూ-57 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా అమ్ములపొదిలో ఇది కీలక యుద్ధ విమానం. 2020లో ఇది సైన్యంలో చేరింది. ఈ విమానం ధ్వంసమైన అక్తుబిన్స్క్‌ వైమానిక స్థావరం ఉక్రెయిన్‌-రష్యా తలపడుతున్న యుద్ధప్రాంతం నుంచి 580 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం తీరును ఈ దాడి మలుపు తిప్పుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ దేశాల ఆయుధాలను తమపైకి ఉక్రెయిన్‌ ప్రయోగిస్తే.. తాము కూడా అమెరికా దాని మిత్ర పక్షాల శత్రువులకు ఆయుధాలు అందిస్తామని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. డ్రోన్‌తోనే ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఉపగ్రహచిత్రాలను కూడా ఉక్రెయిన్‌ నిఘా విభాగం విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని