Hamas Attack: ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులు.. నాలుగు నెలల తర్వాత తొలిసారి!

కొన్ని నెలల వ్యవధి తర్వాత ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్‌ దాడులకు పాల్పడ్డారు.

Published : 26 May 2024 22:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ (Hamas) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దాదాపు నాలుగు నెలల అనంతరం గాజా (Gaza) నుంచి ఇజ్రాయెల్‌ (Israel)పైకి రాకెట్లతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే టెల్‌అవీవ్‌ సహా పలు ప్రాంతాలు సైరన్లతో మార్మోగాయి. అయితే, ఈ దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు.

సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్‌ ప్రాంతాలపై హమాస్‌ ఉగ్రవాదులు అడపాదడపా దాడులు జరుపుతున్నారు. కానీ, ఈ ఏడాది జనవరి అనంతరం గాజా నుంచి జరిగిన మొదటి దీర్ఘశ్రేణి రాకెట్ దాడులివే. దక్షిణ గాజాలోని రఫా నగరం నుంచి ప్రయోగించిన ఎనిమిది ఎగిరే వస్తువులు తమ దేశంలోకి ప్రవేశించగా.. వాటిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. టెల్‌అవీవ్‌ బలగాలు ప్రస్తుతం రఫాపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్‌.. హెజ్‌బొల్లా హెచ్చరిక

మరోవైపు.. ఈజిప్టు నుంచి సహాయక ట్రక్కులు రఫా క్రాసింగ్‌ నుంచి కాకుండా, దక్షిణ ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దు కేంద్రం ద్వారా గాజాలోకి ప్రవేశించాయి. ఈ నెల ప్రారంభంలో ‘రఫా క్రాసింగ్‌’ గాజా వైపు భాగాన్ని టెల్‌అవీవ్‌ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దాన్ని పాలస్తీనియన్లకు తిరిగి అప్పగించే వరకు రఫా క్రాసింగ్ తెరవబోమని ఈజిప్టు తేల్చిచెప్పింది. అయితే, అమెరికా జోక్యంతో.. సహాయక వాహనాలను కెరెమ్‌ షాలోమ్‌ వైపు మళ్లించేందుకు అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు