Earthquake: వణికించిన సునామీ
రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం
జపాన్, అమెరికాల్లోనూ..
ఎగసిపడ్డ రాకాసి అలలు
వివిధ దేశాల్లో హెచ్చరికలు
భయంతో పరుగులు పెట్టిన జనం
ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు

సునామీ హెచ్చరికలతో పనామా నగరంలోని పాన్-అమెరికా జాతీయ రహదారిపై ముందుజాగ్రత్తగా వాహనాల్లో తరలిపోతున్న పౌరులు
మాస్కో, టోక్యో: రష్యాను బుధవారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత నమోదైన ఈ భూకంపంవల్ల రష్యాతోపాటు అమెరికా, జపాన్, హవాయ్ దీవుల్లో సునామీ వచ్చింది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. భూకంపం, సునామీ సమయాల్లో జనం భయంతో పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలింకా అందలేదు. అయితే రష్యా, జపాన్‌లలో కొంత మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాలు కాదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను ఉపసంహరించినా.. మరికొన్ని చోట్ల 24 గంటల వరకూ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సునామీతో పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఉండే లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అమెరికా, జపాన్, రష్యాల్లో పరిస్థితులు కుదుటపడ్డా బుధవారం సాయంత్రానికి చిలీ, క్యూబాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
తొలుత భూకంపం
రష్యా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11.24 గంటలకు భూకంపం సంభవించింది. తొలుత దీని తీవ్రతను 8.0గా నిర్ధారించిన జపాన్, అమెరికా భూకంప శాస్త్రవేత్తలు.. ఆ తరువాత 8.8గా పేర్కొన్నారు. 6.9 తీవ్రతతోపాటు పలుమార్లు భూమి కంపించింది. భూకంప కేంద్రం 1,80,000 జనాభా ఉన్న రష్యా నగరం పెట్రోపావ్‌లోవ్‌స్క్‌కు 119 కిలోమీటర్ల దూరంలో ఉంది. 20.7 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది.
భూకంపం కారణంగా క్లుచ్చేవ్‌స్కాయా సోప్కా అగ్ని పర్వతం నుంచి లావా ప్రవహిస్తోంది.

సునామీ హెచ్చరికలతో బుధవారం ఉత్తర జపాన్‌లోని ముకవా నగరంలో అగ్నిమాపక కేంద్రం భవనంపైకి చేరుకున్న స్థానిక పౌరులు
భయపెట్టిన సునామీ
రష్యాలో వచ్చిన భూకంపంతో ఆ దేశంతోపాటు జపాన్, అమెరికాకు చెందిన హవాయ్ దీవుల్లో సునామీ అలలు ఎగసిపడ్డాయి. కమ్చట్కాలోని తీర ప్రాంతాల్లో అలు ఇళ్లను ముంచెత్తాయి. దీంతో ప్రజలంతా ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు. ఈ సమయంలో కొంత మంది గాయపడ్డారు. జపాన్ ఉత్తర ప్రాంతంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. హవాయ్ రాజధానిలోని తీరా ప్రాంత వీధులు, జాతీయ రహదారులు కార్లలో తరలివెళ్లే వారితో నిండిపోయాయి.
- కమ్చట్కాలో సునామీతో అలలు.. 3 నుంచి 4 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. కురిల్ ద్వీపంలో 10 నుంచి 15 మీటర్ల ఎత్తుల అలలు ఎగిసిపడ్డాయని రష్యా అధికారులు తెలిపారు.
 - జపాన్ ఉత్తర ద్వీపమైన హొకైడోలో 60 సెంటీమీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. జపాన్ తీర ప్రాంతాల్లోని ప్రజలు కొండలపైకి, ఇళ్ల పైకి వెళ్లారు.
 - అలస్కాలోని అల్యూటియన్ ద్వీపంలో 1.4 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి.
 - భూకంపం, సునామీ కారణంగా పలువురు గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. జపాన్‌లో ఒకరు గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు.
 - హొనొలులులో వీధులు కార్లతో జామ్ అయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది.
 - రష్యాలోని తీర నగరం సెవెరోకురిల్స్క్‌లో అలలు భారీగా ఎగసిపడ్డాయని, చేపలబోట్లు కొట్టుకుపోయాయని మేయర్ అలెగ్జాండర్ ఓవ్సియన్నికోవ్ తెలిపారు. విద్యుత్తు సరఫరాను నిలిపేసి తనిఖీ చేశామని వెల్లడించారు.
 - కొన్ని గంటల తర్వాత సునామీ హెచ్చరికలను హవాయ్ ఉపసంహరించుకుంది. పసిఫిక్ తీరంలో ఈ హెచ్చరికలను ఉపసంహరించుకున్న జపాన్.. తూర్పు తీర ప్రాంతంలో కొనసాగిస్తోంది. 24 గంటల వరకూ సునామీ ప్రభావం ఉండవచ్చని ప్రకటించింది.
 - ఫిలిప్పీన్స్, మెక్సికో, న్యూజిలాండ్‌లలో హెచ్చరికలు జారీ అయినా తర్వాత ఉపసంహరించుకున్నారు. వాటితోపాటు ఈక్వెడార్, రష్యా, వాయవ్య హవాయ్, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేసియా, గువామ్, హవాయ్, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్‌స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్ దీవులు, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేసియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగువా, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్, తైవాన్, బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం దేశాలను అప్రమత్తం చేశారు.
 - ముందు జాగ్రత్త చర్యగా జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రంలోని 4,000 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు.
 

రష్యాలోని ఒఖోస్క్ సముద్ర తీర ఉత్తర కురిల్ దీవుల్లో తమను తాము రక్షించుకునేందుకు సముద్రం నుంచి ఒడ్డుకు ఈదుకుంటూ వస్తున్న స్టెల్లర్ సీ లైన్స్
అప్రమత్తమైన భారత్
అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. కాలిఫోర్నియా, హవాయ్‌తో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ భూకంపం కారణంగా హవాయ్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని, అలస్కా, పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇన్‌కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) పేర్కొంది.
తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు..
సునామీ దెబ్బకు తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. సముద్రంలో కల్లోలంతో నీటి మధ్యలో ఉండాల్సిన అవి తీరంలో విసిరేసినట్లు పడ్డాయి. జపాన్‌లోని చింబా తీరంలోని వాటి దృశ్యాలు వైరల్‌గా మారాయి.

రష్యాలోని కమ్చట్కా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో భూకంపం రావడంతో వైద్యులు స్ట్రెచర్‌ను కదలకుండా పట్టుకుని సర్జరీ పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


