Iran helicopter: ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు ప్రమాదం..!

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Published : 19 May 2024 19:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అది కూలిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌తోపాటు కాన్వాయ్‌లో మరో రెండు హెలికాప్టర్లు ఉన్నట్లు తెలిపింది.

అధ్యక్షుడితోపాటు విదేశాంగ మంత్రి హోసేన్‌ అమిరాబ్దోల్లాహియన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నట్లు చెప్పింది. ఒక స్థానిక అధికారి అది కూలినట్లు పేర్కొనగా.. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. సహాయక బృందాలు ఘటనాస్థలానికి బయల్దేరాయని, అయితే.. భారీ వర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని