Viral video: శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్‌చల్!

ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్‌ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్‌చల్ చేశాయి.

Published : 25 Apr 2024 00:14 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: నిత్యం రద్దీగా ఉండే లండన్‌ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్‌చల్ చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్‌ లండన్‌ సమీపంలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది తమ గుర్రాలకు శిక్షణనిస్తున్నారు. ఆ సమయంలో గుర్రాలు ఒక్కసారిగా వారిని తోసుకుంటూ వీధుల్లో పరుగెత్తడం ప్రారంభించాయి. వాటి దాడిలో ఒక సైనికుడికి గాయాలయ్యాయి. అనంతరం రెండు గుర్రాలు రద్దీగా ఉన్న రోడ్లపై హల్‌చల్‌ చేయడంతో పాదచారులు, పలువురు వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కొందరు భయభ్రాంతులకు గురికాగా మరికొందరు ఈ దృశ్యాలను వీడియోల్లో బంధించారు. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. చివరికి లండన్‌లోని లైమ్‌హౌస్‌ సమీపంలోని హైవేపై రెండు గుర్రాలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో ఒకటి బస్సును ఢీకొని గాయాలపాలైందని, మరో గుర్రం కాళ్లకు గాయాలు ఉండడంతో వెటర్నరీ కేర్‌కు తరలించామని పేర్కొన్నారు. లండన్‌లోని అధికారిక భవనాల చుట్టూ ఆర్మీ సిబ్బంది గుర్రాలపై తిరుగుతూ పహారా కాస్తుంటారు. దీనికోసం వాటికి ప్రత్యేక శిక్షణ సైతం కల్పిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని