Israel-Hamas: 16 రోజులు చీకటి గదిలో బంధించి.. బాలుడిని హింసించిన హమాస్‌

హమాస్‌ చెర నుంచి విడుదలైన బందీల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులనే కనికరం చూపకుండా వారిపై హమాస్‌ జరిపిన అకృత్యాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి.

Published : 29 Nov 2023 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. హమాస్‌ విడతల వారిగా 50కి మందికి పైగా బందీలను విడుదల చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగి అక్కడి పౌరులను, చిన్నారులను అపహరించి బందీలుగా చేసుకున్న హమాస్‌ ఆ తర్వాత వారి పట్ల కఠినంగా వ్యవహరించింది. వారికి సరైన ఆహారం కూడా అందించకపోవడంతో పాటు చిన్నారులను చీకటి గదిలో వేసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

హమాస్‌ చెర నుంచి విడుదలైన ఇజ్రాయెల్‌ పౌరులకు చికిత్స కొనసాగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన వారి ఆరోగ్యం క్షీణిచిందని.. సరైన పోషకాహారం లేకపోవడంతో కొద్ది కాలంలోనే వారు చాలా శరీర బరువును కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. దీంతో బందీలు ఎంతగా ఆకలితో అలమటించారో అర్థమవుతోందన్నారు. కొందరి ఆరోగ్య పరిస్థితిని వెల్లడించకూడదంటూ అధికారులు తమను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య నివేదికలు హమాస్‌ చెరలో ఉన్న మరికొందరు బందీలకు ప్రాణ సంకటంగా మారకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. రోజుకు పరిమితంగా తమకు ఆహారం అందించే వారని.. అందులో ఎలాంటి పండ్లు, కూరగాయలు, గుడ్లు ఉండేవి కావని ఓ బాధితురాలు తెలిపింది.

శ్వేతసౌధం, పెంటగాన్‌ ఫొటోలు తీసిన కిమ్‌ శాటిలైట్‌?

ఇటీవల హమాస్‌ నుంచి విడుదలైన 12 ఏళ్ల బాలుడు తన భయానక అనుభవాన్ని తన బామ్మతో పంచుకున్నాడు. 16 రోజుల పాటు ఓ చీకటిగదిలో తనని ఉంచారని.. బాంబుల శబ్ధానికి తానెంతో భయపడ్డానని తెలిపాడు. దీంతో చిన్నారుల పట్ల కూడా హమాస్‌ ఉగ్రవాదులు కఠినంగా వ్యవహరించారో తెలుస్తోందని కథనాలు పేర్కొన్నాయి. కాగా.. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 50కి పైగా బందీలు విడతల వారిగా బయటకు వచ్చారు. వారంతా నవ్వుతూ.. హమాస్‌ మిలిటెంట్లకు వీడ్కోలు చెప్తున్న వీడియోలు ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్‌ బందీల తలపై తుపాకీ గురిపెట్టి వారితో బలవంతంగా నవ్విస్తున్నారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని