China: ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ.. చైనా కఠిన నిర్ణయం..!

చైనా(China) తన అథ్లెట్లకు సైనిక శిక్షణ ఇస్తోంది. దానిలో ఏడేళ్ల నుంచి 25 ఏళ్ల యువ క్రీడాకారుల్ని భాగం చేసింది. 

Updated : 29 Nov 2023 20:26 IST

బీజింగ్: క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా(China) ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. క్రమశిక్షణ, పోరాట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అథ్లెట్లకు కొద్దిరోజుల పాటు ఈ కఠిన శిక్షణ అందిస్తోంది . ఈ మేరకు షాంఘై క్రీడల విభాగం నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా చైనా మిలిటరీ పోరాట స్ఫూర్తి, ప్రమాణాలను యువత పూర్తిగా అర్థం చేసుకుంటుందని పేర్కొంది. 

ఇదివరకు చైనా ఫుట్‌బాల్ జట్లు కూడా ఇదే తరహా శిక్షణ పొందాయి. కమ్యూనిస్టు పార్టీ విలువల విస్తృత ప్రచారంలో భాగంగానే ఈ తరహా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. ప్రస్తుత శిక్షణా కార్యక్రమంలో ఏడేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల అథ్లెట్లు భాగమయ్యారు. షాంఘై నగరంలోని 11 కేంద్రాల్లో 932 మంది అథ్లెట్లు ట్రైనింగ్ పొందుతున్నారు. ‘వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని పురుషుల జిమ్నాస్టిక్ హెడ్ కోచ్‌  వెల్లడించారు. 

ఉక్రెయిన్‌ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం.. ఇది రష్యా కుట్రేనా..?

జట్లు సమిష్టిగా, క్రమశిక్షణతో పనిచేసేందుకు, ఐరన్‌ ఆర్మీని సృష్టించేందుకు ఈ కార్యక్రమం ఉపకరించనుందని వార్తా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. వాస్తవ యుద్ధం కోసం చైనా తన సంసిద్ధతను మెరుగుపర్చుకోవాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోపక్క.. యువతలో దేశభక్తిని నింపేలా గత నెలలో కొత్త విద్యాచట్టాన్ని చైనా ఆమోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు