Myanmar: మయన్మార్‌ భూకంప సహాయక చర్యల్లో భారత రోబోటిక్స్‌ మ్యూల్స్‌

Eenadu icon
By International News Team Published : 11 Apr 2025 11:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల భారీ భూకంపంతో మయన్మార్‌ (Myanmar earthquake) అతలాకుతలమైంది. ముఖ్యంగా మాండలే, నేపిడాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే సహాయక చర్యల విషయంలో ఇప్పటికే ‘ఆపరేషన్‌ బ్రహ్మ (Operation Brahma)’ను ప్రారంభించిన భారత్‌ మరింత సహాయాన్ని అందిస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా భారత రోబోటిక్స్‌ మ్యూల్స్‌తో శిథిలాల కింద వెతుకులాట చేపడుతున్నారు. సిబ్బంది వెళ్లలేని చోటుకి వీటిని పంపి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెతుకుతున్నారు. మార్చి 28న సంభవించిన భూకంపం కారణంగా మయన్మార్‌లో 3 వేలకు పైగా మరణించగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని భద్రతా బృందాలు వెలికితీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

‘ఆపరేషన్‌ బ్రహ్మ (Operation Brahma)’లో భాగంగా భారత్‌ ఇప్పటికే 31 టన్నుల సామగ్రితో కూడిన సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాన్ని మయన్మార్‌కు పంపింది. మాండలేలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన భారత ఆర్మీ ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని కూడా సరఫరా చేసింది. భారత సైన్యం ఆధ్వర్యంలోని ఫీల్డ్‌ ఆస్పత్రి భూకంప క్షతగాత్రులకు తన సేవలను కొనసాగిస్తోంది. భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌’ వందల టన్నుల ఆహారాన్ని శనివారం తిలావా ఓడరేవుకు చేర్చింది. మరోవైపు క్వాడ్‌ దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లు మయన్మార్‌ను ఆదుకునేందుకు ఇటీవల 20 మిలియన్‌ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 118 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

గతనెల 28 నాటి భూకంపం దెబ్బకు మయన్మార్‌ పూర్తిగా అతలాకుతలమైంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇక్కడ మృతి చెందినవారి సంఖ్య 3 వేలు దాటేసింది. ఈక్రమంలో ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకువచ్చాయి. ఇటీవల బిమ్‌స్టెక్‌ సదస్సు సందర్భంగా థాయ్‌లాండ్‌కు వెళ్లిన ప్రధాని మోదీ (PM Modi) మయన్మార్‌లోని ప్రజలను ఆదుకునేందుకు భారత్‌ తరఫున అన్నివిధాలా సాయం చేస్తామని బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్‌ మిన్‌ అంగ్‌కు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు