West Africa: ఐవరీ కోస్ట్‌లో భారతీయ జంట అనుమానాస్పద మృతి

ఆఫ్రికా ఖండంలోని ఐవరీ కోస్ట్‌లో భారతీయ జంట అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ మరణ వార్తను అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 

Updated : 03 Mar 2024 10:47 IST

అబిడ్జన్: భారత్‌కు చెందిన దంపతులు పశ్చిమ ఆఫ్రికా (West Africa)లోని ఐవరీ కోస్ట్‌ ( కోట్‌ డి ఐవరీ) అబిడ్జన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఐవరీ కోస్ట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతులను సంజయ్‌ గోయల్‌ అతడి భార్య సంతోశ్‌ గోయల్‌గా పేర్కొంది.

 సంజయ్‌ గోయల్‌ భార్యతో కలిసి దిల్లీ నుంచి ఐవరీ కోస్ట్‌కు బయలుదేరారు. అయితే, ఇథియోపియాలో దిగిన వారిని తదుపరి విమానం నుంచి డీబోర్డు చేసినట్లు కుమారుడు కరణ్‌ గోయల్‌ ఫిబ్రవరి 27న సంబంధిత ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులను ఎందుకు డీబోర్డు చేశారో తెలియదని.. అప్పుడు వారు ఇథియోపియాలోనే ఉన్నట్లు తెలిపారు. అప్పటికే వారు ఐవరీ కోస్ట్‌లోని అబిడ్జన్‌కు వెళ్లినట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.  తల్లిదండ్రుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సంబంధిత అధికారులను సంప్రదించినట్లు పేర్కొన్నాడు.

అమెరికాలో చెదిరిన నృత్య కల

గోయల్‌ దంపతులు మృతి చెందినట్లు తాజాగా ఐవరీకోస్ట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. దంపతుల మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు స్థానిక యంత్రాంగంతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు