Indian Journalist: న్యూయార్క్‌లో భారత జర్నలిస్టు మృతి..

న్యూయార్క్‌లో నివాసముంటున్న ఓ భారత జర్నలిస్టు అగ్నిప్రమాదంలో మృతి చెందాడు. 

Updated : 25 Feb 2024 12:40 IST

న్యూయార్క్‌: అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన న్యూయార్క్‌ (New York)నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకొంది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోంది. 

మీడియా కథనాల ప్రకారం.. భారత్‌కు చెందిన ఫాజిల్‌ ఖాన్‌ (27) దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో కాపీ ఎడిటర్‌గా పనిచేశాడు. జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు 2020లో న్యూయార్క్‌ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సును పూర్తి చేశాడు. నాటి నుంచి అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం నాడు తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ ద్విచక్రవాహనంలోని లిథియం అయాన్‌ బ్యాటరీలో మంటలు ఎగశాయి. అవి వేగంగా వ్యాపించి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది.

నావల్నీ మృతదేహం ఎట్టకేలకు అప్పగింత

ఈ ప్రమాదంలో ఫాజిల్‌ ఖాన్‌ మృతి చెందాడు. కొందరు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రమాదంపై భారత కార్యాలయం స్పందించింది. ఫాజిల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉంటున్నామని.. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని