Palestine: ‘ప్రత్యేక పాలస్తీనా’ను గుర్తించిన ఐర్లాండ్‌, స్పెయిన్‌, నార్వే

మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని బలంగా వాదిస్తున్న ఐరోపా దేశాల్లో కొన్ని కీలక ముందడుగు వేశాయి.  ప్రత్యేక పాలస్తీనాను గుర్తించాయి. 

Published : 22 May 2024 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel Hamas conflict) మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని బలంగా వాదిస్తున్న ఐరోపా దేశాలు.. పాలస్తీనాను ప్రత్యేక రాజ్యంగా గుర్తించాయి. ఇటీవల నార్వే ఈ విషయాన్ని వెల్లడించగా.. తాజాగా ఐర్లాండ్‌, స్పెయిన్‌ కూడా ప్రత్యేక పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాలపై ఇజ్రాయెల్‌ మండిపడింది. ఆయా దేశాల నుంచి తమ రాయబారులను ఉపసంహరించుకొనేందుకు చర్యలు చేపట్టింది.

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు నార్వే ప్రధానమంత్రి జోనాస్‌ గర్‌ స్టోర్‌ ప్రకటించారు. ఇలా గుర్తించకుంటే మధ్యప్రాచ్యంలో శాంతి ఉండదన్న ఆయన.. మే 28 నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు. మరోవైపు స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంషెజ్‌ అక్కడి పార్లమెంటులో ప్రసంగిస్తూ.. ఈ నెల 28 నుంచి పాలస్తీనాను ప్రత్యేక రాజ్యంగా పరిగణిస్తామన్నారు. ఐర్లాండ్‌ ప్రధాని సైమన్‌ హ్యారిస్‌ మాట్లాడుతూ.. స్పెయిన్‌, నార్వేలతో సమన్వయం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది ఐర్లాండ్‌తోపాటు పాలస్తీనాకు చారిత్రక దినమని పేర్కొన్నారు. అక్కడ శాంతికి ఇదే పరిష్కార మార్గమన్నారు.

ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉందా?

తాజా పరిణామాలపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ఐరోపా దేశాల నిర్ణయాలను వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఉన్న తమ రాయబారులను వెనక్కి రప్పిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి కాట్జ్‌ పేర్కొన్నారు. పాలస్తీనాతోపాటు యావత్‌ ప్రపంచానికి ఐర్లాండ్‌, నార్వేలు ఉగ్రవాదం విజయం సాధిస్తుందనే సందేశాన్ని పంపాలని భావిస్తున్నాయా..? అని ప్రశ్నించారు. హమాస్‌ చెరలోని బందీలను విడిపించడం, కాల్పుల విరమణ ఒప్పందాల ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు