Iran Israel Conflict: సుప్రీం లీడర్‌ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!

ఇరాన్‌పై డ్రోన్‌ దాడి విషయంలో ఇజ్రాయెల్‌ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.

Published : 20 Apr 2024 00:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ (Iran)లో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన పేలుళ్లకు ఇజ్రాయెల్‌ (Israel) ప్రతీకార దాడులే కారణమని అమెరికా చెబుతోంది. ఈ దాడి గురించి టెల్‌అవీవ్‌ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని జీ7 దేశాలతో అమెరికా (USA) చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఈ ఘటనలో తమ పాత్రేమీ లేదని అగ్రరాజ్యం స్పష్టం చేసిందన్నారు.

ఇస్ఫహాన్‌లోని వైమానిక, అణు స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను తమ గగనతల రక్షణవ్యవస్థ సాయంతో కూల్చినట్లు టెహ్రాన్‌ తెలిపింది. దీని కారణంగానే పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఆ డ్రోన్లతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఎగిరే వస్తువులను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి తెలిపారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతోల్ల అలీ ఖమేనీ 85వ పుట్టినరోజే ఈ దాడులు జరగడం గమనార్హం.

డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్‌.. ‘నో కామెంట్స్‌’ అంటున్న ఇజ్రాయెల్‌

ఇరాన్‌పై దాడి జరిగిన సమయంలోనే.. అటు సిరియాపైనా ఇజ్రాయెల్‌ క్షిపణులతో విరుచుకుపడినట్లు సమాచారం. తమ గగనతల రక్షణ వ్యవస్థే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని సిరియా అధికారిక మీడియా తెలిపింది.  ప్రభుత్వ దళాలకు చెందిన సైనిక రాడార్‌ను ఆ క్షిపణి తాకినట్లు బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా? అనేది తెలియరాలేదని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు