Israel-Russia: పుతిన్‌కు నెతన్యాహు ఫోన్‌.. ఇరాన్‌కు సహకారంపై అసంతృప్తి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఫోన్‌ చేశారు. ఇరాన్‌కు రష్యా అందిస్తున్న సహకారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 11 Dec 2023 12:01 IST

టెల్‌ అవీవ్‌/మాస్కో: ఇరాన్‌కు రష్యా సహకారం అందించడంపై ఇజ్రాయెల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu).. రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin)తో ఫోన్‌లో మాట్లాడారు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు తెలపడంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ పాటించాలని శనివారం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి రష్యా మద్దతు ఇవ్వగా.. అమెరికా వీటో అధికారంతో అడ్డుకుంది.

ఇరాన్‌కు రష్యా సహకారం అదించడంపై కూడా ఇజ్రాయెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రమాదకరమైన సహకారమని పుతిన్‌తో నెతన్యాహు చెప్పినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై పుతిన్‌ స్పందిస్తూ.. ఇరువురి మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించి తీరాలని పుతిన్‌ పేర్కొన్నట్లు మాస్కో తెలిపింది. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనే క్రమంలో సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ పర్యవేక్షణ బృందం గాజాలో పర్యటించి అక్కడి పౌరులకు అందుతున్న మానవతా సాయాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆదివారం రష్యా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.

అలాగైతే బందీలు ప్రాణాలతో ఉండరు.. ఇజ్రాయెల్‌కు హమాస్‌ హెచ్చరిక

మరోవైపు హమాస్‌ ఉగ్రవాదులకు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. హమాస్‌ ఉగ్రవాదులంతా వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని, పాలస్తీనియన్‌ గ్రూప్‌ ముగింపు దగ్గరపడిందని హెచ్చరించారు. గత కొన్నిరోజులగా పదులు సంఖ్యలో హమాస్‌ ఉగ్రవాదులు తమ బలగాల ఎదుట లొంగిపోయినట్లు ఆయన చెప్పారు. అయితే మిలిటెంట్లు లొంగిపోయినట్లు ఇజ్రాయెల్‌ ఇంతవరకు సాక్ష్యం చూపెట్టలేదు. మరోవైపు తమవారు లొంగిపోయినట్లు వస్తున్న వార్తలను హమాస్‌ తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు