Israel Hamas War: నిఘా వైఫల్యం ఎఫెక్ట్‌..! ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజీనామా

అక్టోబరు 7నాటి హమాస్‌ దాడుల విషయంలో నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్‌ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరోన్‌ హలీవా రాజీనామా చేశారు.

Published : 22 Apr 2024 17:07 IST

టెల్‌అవీవ్‌: అక్టోబరు 7నాటి హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ (Israel) ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత సమర్థమంతమైనవిగా గుర్తింపుపొందిన ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు.. హమాస్‌ కదలికలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. దీనిపై భద్రతా అధికారులు క్షమాపణలు సైతం చెప్పారు. ఈ క్రమంలోనే నాటి ఇంటెలిజెన్స్‌ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. ఇజ్రాయెల్‌ మిలటరీ నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరోన్‌ హలీవా రాజీనామా చేశారు. హమాస్‌ దాడుల వ్యవహారంలో రాజీనామా చేసిన మొదటి సీనియర్ సైనికాధికారి ఆయనే.

యుద్ధం ‘తల్లి’ ప్రాణం తీస్తే.. వైద్యులు ‘గర్భస్థ శిశువు’కు ఊపిరిపోశారు!

హలీవాకు సైన్యం (IDF)లో 38 ఏళ్ల అనుభవం ఉంది. ఉగ్రవాదుల ప్రణాళికలను గుర్తించడంలో తమ విభాగం వైఫల్యాన్ని ఆయన అంగీకరించారు. ‘‘మేం ముఖ్యమైన పనిని పూర్తి చేయలేదు. మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తాను’’ అని పేర్కొన్నారు. యుద్ధం మొదలైన ఆరు నెలల తర్వాత రాజీనామా చేశారు. తన స్థానంలో మరొకరు నియమితులైన తర్వాత వైదొలగనున్నట్లు వెల్లడించారు. అక్టోబరు 7నాటి దాడుల్లో ఇజ్రాయెల్‌లో దాదాపు 1200 మందికిపైగా మృతి చెందారు. దీంతో హమాస్‌ అంతమే లక్ష్యంగా టెల్‌అవీవ్‌ యుద్ధం ప్రకటించింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని