Israel Hamas Conflict: ఉత్తర గాజాకు తిరిగి వెళ్లొద్దు..! ఇజ్రాయెల్‌ హెచ్చరిక

ఉత్తర గాజా ఇప్పటికీ క్రీయాశీలక యుద్ధక్షేత్రమేనని, పాలస్తీనీయులు ప్రస్తుతం అక్కడికి తిరిగి వెళ్లొద్దని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. 

Published : 16 Apr 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ (Hamas) అంతమే లక్ష్యంగా యుద్ధం మొదట్లో ఉత్తర గాజా (Northern Gaza)పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. దీంతో ఇక్కడున్న లక్షలాది మంది పాలస్తీనీయులు దక్షిణ గాజాకు తరలివెళ్లారు. ప్రస్తుతం గాజా (Gaza)లో ఇజ్రాయెల్‌ (Israel) తన బలగాలను కొంతమేర ఉపసంహరించడం, ఉత్తర ప్రాంతంపై హమాస్‌ పట్టుతగ్గిందని పేర్కొనడంతో పెద్దఎత్తున ప్రజలు మళ్లీ ఇంటిబాట పట్టారు. అయితే.. ఆ ప్రాంతం ఇప్పటికీ క్రీయాశీలక యుద్ధక్షేత్రమేనని, అక్కడికి వెళ్లొద్దని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. ఉత్తరాదికి వెళ్తున్న క్రమంలో దాడుల్లో ఐదుగురు స్థానికులు మృతి చెందిన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేసింది.

ఇజ్రాయెల్‌పై దాడులు.. అమెరికాకు ముందే చెప్పాం: ఇరాన్‌

‘‘ఉత్తర గాజా ఇప్పటికీ ప్రమాదకర యుద్ధ క్షేత్రం. ఇక్కడి పాలస్తీనీయులు దక్షిణంలోనే ఉండాలి’’ అని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి అవిచయ్‌ అద్రీ తెలిపారు. ఈ ప్రాంతంలో టెల్‌ అవీవ్‌ వైమానిక దాడులు, లక్షిత కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గాజాలోని అతిపెద్ద అల్‌-షిఫా వద్ద దారుణ పరిస్థితులు ఉన్నాయి. హమాస్‌ మిలిటెంట్లు మళ్లీ సమూహాలుగా ఏర్పడి, బలపడకుండా అడ్డుకునేందుకుగానూ ఈ ప్రాంతానికి ప్రజల రాకను ఆలస్యం చేయాలని నెతన్యాహు సర్కారు భావిస్తోంది. హమాస్‌ మాత్రం.. స్థానికులు రావడాన్ని నిరోధించవద్దని పేర్కొంటోంది. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని