Japan: జపాన్‌లో భూకంపం.. అణు ప్లాంట్‌ మూసివేత

జపాన్‌లోని ఫుకుషిమాలో భూకంపం వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అణు కేంద్రాన్ని మూసివేశారు.

Updated : 15 Mar 2024 13:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌(Japan)లో అణుకేంద్రం ఉన్న ఫుకుషిమా ప్రాంతంలో మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.8గా నమోదైంది. ఫలితంగా అక్కడ ఉన్న అణు విద్యుత్తు ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 2011లో వచ్చిన సునామీ కారణంగా ఇది తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ‘‘ప్రస్తుతం ఏఎల్‌పీఎస్‌ ట్రీటెడ్‌ వాటర్‌ డిశ్ఛార్జి కేంద్రంలో ఎటువంటి సమస్య తలెత్తలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్లాంట్‌ను మూసివేశాం’’ అని టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) శుక్రవారం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

ఈ నిర్ణయంతో దైచీ అణు విద్యుత్తు కేంద్రం నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఇక్కడ ఎటువంటి రేడియేషన్‌ లీకులను గుర్తించలేదని టెప్కో చెబుతోంది. మానిటరింగ్‌ పోస్టులో రీడింగ్స్‌ కూడా సాధారణంగా ఉన్నట్లు పేర్కొంది.

హూతీల వద్ద హైపర్‌సోనిక్‌ క్షిపణులు!

గతేడాది ఆగస్టులో టెప్కో ఇక్కడి నుంచి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను మెల్లగా పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈ కేంద్రంలో 540 ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌కు సమానమైన జలాలు ఉన్నాయి. 2011 ప్రమాదం తర్వాత దైచీ అణు కేంద్రం నుంచి వీటిని సేకరించారు. జపాన్‌ ఏటా వందల కొద్దీ భూకంపాలను ఎదుర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని