Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్‌

2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రస్తుత, మాజీ అధ్యక్షులు బైడెన్‌, ట్రంప్‌ రంగంలోకి దిగారు.  

Updated : 06 Dec 2023 14:52 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీలో లేకపోతే.. తాను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు.

‘ట్రంప్ పోటీలో లేకపోతే.. నేను పోటీ చేస్తానో లేదో కచ్చితంగా తెలియదు. కానీ ఈ దేశం కోసం ఆయన్ను మాత్రం గెలవనివ్వం’ అని బైడెన్‌ అన్నారు. ప్రస్తుత, మాజీ అధ్యక్షులు అయిన బైడెన్, ట్రంప్‌.. తాము ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన బైడెన్‌(Biden)కు ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల్లో బైడెన్‌ వయసు అంశం ప్రధానం కానుంది. రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి చేసేనాటికి 86 ఏళ్లకు చేరుకోనున్నారు.

ఒక్కరోజే నియంతగా ఉంటా: ట్రంప్‌

2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్(Trump) గెలిస్తే.. అమెరికా నిరంకుశ పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ‘నేను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. నియంతగా మారను. కానీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు మాత్రం నియంతగా ఉంటాను’ అని వ్యాఖ్యానించారు.

‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్‌.. వీడియో వైరల్‌

ఆ మొదటి రోజు మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడానికి, చమురు డ్రిల్లింగ్‌ను విస్తరించడానికి తన అధ్యక్ష అధికారాలను ఉపయోగించొచ్చని తెలుస్తోంది. 2017 నుంచి 2021 మధ్య ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని