Azam Cheema: ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి మృతి..

15 ఏళ్ల క్రితం ముంబయిలో మారణహోమానికి కుట్ర పన్నిన లష్కరే తోయిబా కీలక సూత్రధారి అజామ్‌ ఛీమా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 

Published : 02 Mar 2024 13:21 IST

ఇస్లామాబాద్‌: 26/11 ముంబయి బాంబు పేలుళ్ల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా (Azam Cheema) గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నగరంలో ప్రాణాలు కోల్పోయినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. కేవలం 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు అజామ్‌ సూత్రధారి. 2006లో ముంబయి  రైళ్లలో జరిగిన బాంబు పేలుడు వెనుక అతని హస్తం ఉంది. నాటి ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

గాజాలో ఆకలి కేకలు.. బైడెన్‌ కీలక నిర్ణయం

పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు నవంబరు 26, 2008న ముంబయిలో మారణహోమానికి పాల్పడ్డారు. కొలాబా సముద్ర తీరం నుంచి ముంబయిలోకి ప్రవేశించారు. బృందాలుగా విడిపోయి అనేక చోట్ల విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. అజామ్‌ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో అతని పేరును మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు