UAE floods: దుబాయ్‌ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా

పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని దుబాయ్‌ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. 

Updated : 23 Apr 2024 12:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)ను వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుతో దుబాయ్‌లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం.. కొద్దిగంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. ఈ కుండపోత వానల ప్రభావాన్ని చూపించే చిత్రాలను నాసాకు చెందిన ల్యాండ్‌శాట్ 9 తీసింది. ఆ దృశ్యాల్లో ఎప్పుడూ పొడిగా కనిపించే ఏడారిలో ముదురు నీలం రంగులో భారీ నీటి కుంటలు దర్శనమిచ్చాయి. ఇక తేమ నిండిన ప్రాంతాలు ఆకుపచ్చ రంగులో దర్శమనిచ్చాయి. వర్షం తగ్గుముఖం పట్టిన రెండురోజుల లోపే(ఏప్రిల్‌ 19న) యూఏఈ మీదుగా పయనించిన నాసా శాటిలైట్ వీటిని చిత్రీకరించింది. 

ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్‌ సీడింగ్‌ కారణమా?

ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజైరా.. నీరులేని పర్వత ప్రాంతాలు, రాతి నేలలు, మైదానాల మిశ్రమంతో కూడిన ఈ ప్రదేశం రాతి ఎడారిగా పేరొందింది. సాధారణంగా గతంలో యూఏఈ ఈ స్థాయి వర్షాలను చూడలేదు. అలాంటిది గత రెండు మూడు సంవత్సరాల్లో తరచూ భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని