Papua New Guinea: పాపువా న్యూగినీలో 670 మంది సజీవ సమాధి

పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 670కి పైగా ఉంటుందని ఆదివారం ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐవోఎం) తెలిపింది.

Published : 27 May 2024 05:07 IST

కొండచరియలు విరిగిపడిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో స్థానికుల సహాయక చర్యలు

మెల్‌బోర్న్‌: పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 670కి పైగా ఉంటుందని ఆదివారం ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐవోఎం) తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. తొలుత 60 ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. దీంతో మృతుల సంఖ్య 100 వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా 150కి పైగా ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయని మృతుల సంఖ్య భారీగా ఉండనుందని ఐవోఎం పేర్కొంది. కొండచరియలు ఇంకా విరిగిపడుతుండటంతో సహాయక చర్యల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా అంతర్జాతీయ మద్దతు తీసుకొనే అంశాన్ని న్యూగినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆదివారం నాటికి అయిదు మృతదేహాలను మాత్రమే సహాయక బృందాలు వెలికితీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని