largest earthquakes: ప్రపంచాన్ని వణికించిన టాప్‌ 10 అతి భారీ భూకంపాలు ఇవే..

Eenadu icon
By International News Team Updated : 30 Jul 2025 13:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా తీరంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. ఈ భారీ భూప్రకంపనల ధాటికి రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. పసిఫిక్‌ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటివరకూ ప్రపంచాన్ని వణికించిన 10 అతి భారీ భూకంపాలను పరిశీలిస్తే..(largest earthquakes ever recorded)

  • చిలీలో 1960లో అతి భారీ భూకంపం సంభవించింది.  బయోబియో ప్రాంతంలో 9.5 తీవ్రతతో కూడిన ఈ భూకంపాన్ని వాల్డివియా భూకంపం లేదా గ్రేట్‌ చిలీ భూకంపం అని పిలుస్తారు. ఇప్పటి వరకూ సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపం ధాటికి దాదాపు 1,655 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
  • అమెరికాలోని అలస్కాలో 1964లో 9.2 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. గ్రేట్‌ అలస్కా భూకంపం, ప్రిన్స్‌ విలియం సౌండ్‌ భూకంపం, గుడ్‌ ఫ్రైడే భూకంపంగా దీనిని పిలుస్తారు. ఈ భూకంపం, దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా 130 మంది మరణించారు. 2.3 బిలియన్‌ డాలర్ల ఆస్తినష్టం జరిగింది.
  • 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా-అండమాన్‌ దీవుల్లో భూ ప్రకంపనలు భారీ సునామీకి దారితీశాయి. 2,80,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో 1.1 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు.
  • ‘గ్రేట్‌ తోహోకు’ భూకంపంగా పిలిచే భారీ భూకంపం 2011లో చోటుచేసుకుంది. జపాన్‌లోని తోహోకు ప్రాంతంలో 9.1 తీవ్రతతో సంభవించింది. ఆ తర్వాత సునామీ కారణంగా 15,000 మందికి పైగా మరణించగా.. 1,30,000 మంది నిరాశ్రయులయ్యారు.
  • ప్రపంచంలో తొలిసారి 9 తీవ్రతతో కూడిన భూకంపం 1952లో వచ్చింది. రష్యాలోని కమ్చట్కా క్రై ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. హవాయిని తాకిన ప్రకంపనలు భారీ సునామీకి దారితీశాయి. ఈ భూకంపంలో 1 మిలియన్‌ డాలర్ల ఆస్తి నష్టం చోటుచేసుకుంది.
  • చిలీలోని బయోబియోలో మరోసారి 2010లో 8.8 తీవ్రతతో కూడిన భూప్రకంపనలు సంభవించాయి. క్విరిహ్యూ నగరం సమీపంలో చోటుచేసుకున్న ప్రకంపనలు 523 మంది ప్రాణాలను తీశాయి. 3.7 లక్షల ఇళ్లను ధ్వంసం చేశాయి.
  • 1906లో 8.8 తీవ్రతతో సంభవించిన ఈక్వెడార్‌-కొలంబియా భూకంపం బలమైన సునామీకి దారితీసింది. 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అలస్కాలోని ర్యాట్‌ దీవులకు సమీపంలో 1965లో 8.7 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. దీని కారణంగా 35 అడుగుల ఎత్తైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి.
  • అరుణాచల్‌ ప్రదేశ్‌లో 1950లో 8.6 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ‘అస్సాం-టిబెట్‌’ భూకంపంగా దీనిని పిలుస్తారు. ఈ ఘటనలో దాదాపు 780 మంది మరణించారు.
  • ఇండోనేషియాలోని ఉత్తర సమత్రా తీరంలో 2012లో భారీ భూకంపం సంభవించింది. 8.6 తీవత్రతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Tags :
Published : 30 Jul 2025 11:27 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు