USA: నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్‌..నదిలో పడిన కార్లు..!

ఒక నౌక ఢీకొనడంతో బ్రిడ్జ్ కూలిపోయిన ఘటన అమెరికా(USA)లో చోటుచేసుకుంది. 

Updated : 26 Mar 2024 16:22 IST

వాషింగ్టన్: అమెరికా(USA)లో అనూహ్య ఘటన జరిగింది. నౌక ఢీకొనడం(Ship Collision)తో బాల్టిమోర్ నగరంలో ఏకంగా ఒక బ్రిడ్జ్‌ కూలిపోయింది. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్‌ స్కాట్ కీ బ్రిడ్జ్‌ కూలిపోయింది’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపింది. దీంతో పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు సాధ్యం కాదని డ్రైవర్లకు సూచించింది. ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది గల్లంతైనట్లు సమాచారం.

స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీస్థాయి కంటైనర్ షిప్ ఈ వంతెనను ఢీకొట్టింది. దీంతో అది పేకమేడలా కూలిపోయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ సమయంలో వారధి(US Bridge) మీద ఉన్న పదుల సంఖ్యలో కార్లు నదిలో పడిపోయినట్లు సమాచారం. 

ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి.. 36 గంటలపాటు అందులోనే చిక్కుకుపోయి!

చైనాలో గత నెల ఇదే తరహా ఘటన జరిగింది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఉన్న లిజింగ్షా వంతెనను ఓ నౌక బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. ప్రమాదం అనంతరం ఈ నౌక వంతెన మధ్యే చిక్కుకుపోయింది. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్‌ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని