Malaysia: ‘సరదా’ వీడియో.. కిరీటాన్ని కోల్పోయిన అందాల భామ

  కుటుంబంతో ట్రిప్‌కు వెళ్లిన మలేషియా అందాల తార.. ఓ సరదా వీడియో కారణంగా తన కిరీటాన్ని కోల్పోయింది. 

Published : 11 Apr 2024 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలేషియా అందాల తార సరదాగా తీసుకున్న ఓ వీడియో ఆమె కొంపముంచింది. దీంతో వివాదంలో చిక్కుకున్న బ్యూటీ క్వీన్‌ తన కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

24 ఏళ్ల వీరూ నికాహ్ టెరిన్సిప్.. 2023లో మలేషియాలో నిర్వహించిన అందాల పోటీల్లో విజేతగా నిలిచారు. ఉండక్‌ ఉంగడ్యూ జొహొర్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల హాలీడే ట్రిప్‌ కోసం థాయ్‌లాండ్‌ వెళ్లిన టెరిన్సిప్‌.. డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు ఆమె తీరుపై విమర్శలు గుప్పించారు. చిన్న దుస్తులు ధరించిన ఆమె కొందరు వ్యక్తులతో డాన్స్‌ చేయడమే విమ్శరలకు కారణం.

బ్యూటీ క్వీన్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్ (KDCA) స్పందించింది. అందాల తార చర్యను తప్పుబట్టింది. ‘‘బ్యూటీ క్వీన్‌ టెరిన్సిప్ తన కుటుంబంతో ఆనందంగా గడపవచ్చు. కానీ, ఈ విధంగా ప్రవర్తించడం తగదు. ఒకవేళ ఆమె సాధారణ వ్యక్తి అయితే.. ఈ వీడియోతో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చాలామంది ఆమె తీరుపై మాకు ఫిర్యాదులు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకే.. మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కేడీసీఏ అధ్యక్షుడు జోసెఫ్ పైరిన్ కిటింగన్ పేర్కొన్నారు.

ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారుఆహ్వానం

తనపై వచ్చిన విమర్శలపై నికాహ్ టెరిన్సిప్ స్పందించారు. అసోసియేషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన ఆమె క్షమాపణలు కోరారు. ‘‘కేడీసీఏ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఎవరి బలవంతం లేకుండా టైటిల్‌ తిరిగి ఇచ్చా. నాపై నాకున్న నమ్మకాన్ని విలువైందిగా భావిస్తున్నా. ఒక టైటిల్‌ విజయాన్ని నిర్ణయించలేదు. మనం ఇతర సమస్యలపై దృష్టి పెట్టి ముందుకుసాగుదాం’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు